Video Viral:   మందుకొట్టి మత్తులో స్కూలుకు వచ్చిన టీచర్​

Video Viral:   మందుకొట్టి మత్తులో స్కూలుకు వచ్చిన టీచర్​

విద్యార్థులకు ఆదర్శంగా ఉండాల్సిన ఉపాధ్యాయుడే మద్యం తాగి పాఠశాలకు వచ్చాడు. మధ్యప్రదేశ్ జబల్‌పూర్‌ జిల్లా జమునియా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో  షాకింగ్ ఘటన జరిగింది. పాఠశాలకు రాజేంద్ర అనే ఉపాధ్యాయుడు మద్యం మత్తులో వచ్చాడు. దీనిని చిన్నారులు తల్లిదండ్రులు వీడియో తీశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాజేంద్ర ఇలా పాఠశాలకు తరచూ మద్యం తాగి వస్తాడని, గతంలో ఆయనపై పలుమార్లు విద్యాశాఖకు ఫిర్యాదు చేశామని చిన్నారుల తల్లిదండ్రులు పేర్కొన్నారు.

మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌ జిల్లాలో ఓ టీచర్ తాగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాఘ్‌రాజీ క్లస్టర్‌లోని జమునియా స్కూల్‌ టీచర్​ ఉపాధ్యాయుడు రాజేంద్ర నేతం మద్యం తాగి పాఠశాలకు వచ్చాడు.  ఎలా తాగాడంటే అడుగు తీసి అడుగు వేయలేని స్థితికి వచ్చే వరకు తాగాడు.  అతికష్టం మీద స్కూల్​ మెట్ల దగ్గరకు వచ్చే సరికి మత్తు పీక్​ స్టేజీకి చేరుకుంది.  దీంతో అతను అడుగు తీసి అడుగు వేయలేకపోవడంతో .. శరీరాన్ని నియంత్రించుకోలేక  స్కూల్ మెట్ల దగ్గరకు చేరుకుని కూర్చుండిపోయాడు. అది చూసిన విద్యార్థులు టీచర్‌ని వీడియో తీసి సోషల్‌ మీడియాలో వైరల్‌ చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో విద్యాశాఖ అధికారులు విచారణకు ఆదేశించారు. 

గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామ సర్పంచ్ కూడా పలుమార్లు ఉపాధ్యాయుడికి వివరించి మద్యం సేవించి పాఠశాలకు రావద్దని సూచించాడు. అయినప్పటికీ ఎలాంటి మార్పు రాలేదు. ఇంతకుముందు కూడా ఉపాధ్యాయుడు రాజేంద్ర నేతమ్‌ను ఎక్కడ పనిచేసినా...  ప్రతిచోటా ఇలాంటి కార్యకలాపాలు నిర్వహించాడని తోటి ఉపాధ్యాయులు చెబుతున్నారు. చాలా సార్లు పరిస్థితి దిగజారడంతో సాయంత్రం పాఠశాల మూసేసిన  తర్వాత అతడిని ఇంటికి తీసుకెళ్లామని ఉపాధ్యాయులు తెలిపారు.

వైరల్ అవుతున్న వీడియోలో, ఉపాధ్యాయుడు మద్యం మత్తులో అక్కడక్కడ తిరుగుతూ కనిపించాడు. ఈ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇలా జరగడం ఇదే మొదటిసారి కాదు. ఉపాధ్యాయుడు రాజేంద్ర నేతం రోజూ మద్యం తాగి పాఠశాలకు వచ్చి అక్కడక్కడ తిరుగుతుంటాడని చెప్పారు. ఈ విషయమై ప్రిన్సిపాల్‌కు పలుమార్లు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకపోవడంతో విద్యార్థులు పాఠాలు చెప్పాలంటూ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.ఈ పరిస్థితిని గమనించిన గ్రామస్తులు ఈ ఉపాధ్యాయుడిని వెంటనే పాఠశాల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. 

 జమునియా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నారు. 55 మంది పిల్లలకు ఇక్కడ ప్రవేశం కల్పించారు. ఉపాధ్యాయుడు రాజేంద్ర నేతమ్ మద్యం సేవించి పాఠశాలలో తలదాచుకోవడం...  ఇతర ఉపాధ్యాయులు పిల్లలందరికీ ఒకచోట కూర్చొని పాఠాలు చెప్పడం చాలా సార్లు జరుగుతుంది. ఇప్పుడు అతని వీడియో వైరల్ కావడంతో జబల్పూర్ విద్యా శాఖ డిప్యూటీ డైరెక్టర్ ధర్మేంద్ర ఖరే దీనిపై విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. నివేదిక రాగానే నిందితుడిపై చర్యలు తీసుకుంటామన్నారు..